Surprise Me!

జగన్ స్వయంగా పిలిచినా... డుమ్మా కొట్టిన మెగాబ్రదర్స్!! | Oneindia Telugu

2019-05-30 1,137 Dailymotion

YSR Congress chief Jaganmohan Reddy was sworn in as the Chief Minister of Andhra Pradesh. YS Jagan called and invited Pawan Kalyan and Chiranjeevi to attend the swearing-in ceremony as Chief Minister. Besides Janasena's chief Pawan Kalyan, Megastar Chiranjeevi also did not attend. Pawan Kalyan has not sent a party representative on behalf of the Janasena party. TDP leader Chandrababu Naidu wrote the letter saying congratulations to Jagan, who is sworn in as Chief Minister.
#jaganmohanreddy
#AP
#pawankalyan
#chiranjeevi
#chandrababunaidu
#letter
#Vijayawada

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డుమ్మాకొట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తన ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్, చిరంజీవిలను ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరుకాలేదు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ కనీసం పార్టీ ప్రతినిధిని సైతం పంపలేదు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్ కు శుభాకాంక్షలు అంటూ తెలిపారు.

మెగా హీరో చిరంజీవికి ఫోన్ చేసి ఆప్యాయంగా మాట్లాడిన జగన్ మీకు ఏపీ మీద అవ‌గాహ‌న ఉంది. భ‌విష్య‌త్‌లో మీ స‌హ‌కారం అవ‌స‌రం..స‌తీ స‌మేతంగా ప్రమాణ స్వీకారానికి రండి అని జ‌గ‌న్ ఆహ్వానించ‌గానే వెంట‌నే చిరంజీవి త‌ప్ప‌కుండా అని స‌మాధానం ఇచ్చారు. త‌న తో జ‌గ‌న్ అప్యాయంగా మాట్లాడిన తీరుకు అభినంద‌న‌లు తెలిపారు. ఇక‌, ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఫోన్ చేసారు. మీరు ఎన్నిక‌ల్లో బాగా పోరాడారు..రాజ‌కీయాలు వేరు. ఇది వ్య‌క్తిగ‌త సంబంధంతో ఆహ్వానిస్తున్నా..ప్ర‌మాణ స్వీకారానికి రండి అంటూ ఆహ్వ‌నించారు. ప‌వ‌న్ సైతం షూర్ అంటూ స‌మాధానం ఇచ్చారు. కానీ జగన్ ప్రమాణ స్వీకారానికి మెగా బ్రదర్స్ ఇద్దరూ రాలేదు.